Pages

Monday 1 October 2012

ఎన్ని `లైకు` లు కావాలి?


ఫేస్ బుక్ – పాస్ వర్డ్ టైప్ చేసి, ఎకౌంట్లోకి వెళ్ళిన వెంటనే టాప్ బార్ మీద ఎరుపురంగు నోటిఫికేషన్స్ ఉంటే, ఎన్ని లైకులు, ఎన్నిషేర్లు, ఎన్నికామెంట్లు తెలుసు కోవడానికి ఉత్సాహ పడతాం; లేకపోతే మళ్ళీ… ` గాడిద గుడ్డు లే` అనే ఫేస్ బుక్ ఎకౌంట్ నుంచి 1,563  లైకులు, 1,368  షేర్లూ ఉన్న ఒక పోస్ట్ వెతికి -
  • మీలో మానవత్వం ఉంటే లైక్ కొట్టండి…
  • ప్రతీ షేర్ కీ ఫేస్ బుక్ ఈ పేషంటు కి ఒక డాలర్ పే చేస్తుంది…
  • మహేష్ బాబు నవ్వుకి లైక్, పవన్ కల్యాణ్ నవ్వుకి షేర్…
  • నువ్వు నిజమైన భారతీయుడివైతే లైక్ చెయ్యి…
అని మన కామెంట్ కలిపి షేర్ చేస్తాం –

మనవి కాని ఫోటోలకి, అభిప్రాయాలకి మనమెందుకు ఇతరులనుంచి ప్రశంశలు ఆశిస్తున్నాం? మీరు లైక్ బటన్ హిట్ చేస్తే ఫేస్బుక్కో, మరొకరో ఎందుకు ఎవరికో డాలర్లు చెల్లిస్తారు? నిజంగా అభాగ్యులకి సహాయం చెయ్యాలంటే మీలైకులకోసం ఆగవలసిన అవసరంలేదు కదా?

అసలు మనకి ఎన్ని లైకులు కావాలి? ఎందుకు కావాలి?
***
డేనియల్ డీఫో రాసిన `రాబిన్సన్ క్రూసో` నవలలో హీరో ఒక నిర్మానుష్యమైన ద్వీపంలో 35 సంవత్సరాలు ఒంటరిగా జీవించవలసి వస్తుంది. నిజానికి మరొక మనిషి సాహచర్యం లేకుండా మనుగడ సాగించడం దాదాపు అసాధ్యం అని ట్రాన్సక్షనల్ ఎనలిస్టులు చెపుతారు. ముఖ్యంగా ఎరెక్ బెర్న్ తన పుస్తకం `గేంస్ పీపుల్ ప్లే` లో సమాజంలో ఉన్న మిగిలిన వ్యక్తులచేత గుర్తించబడటం మనిషిని బ్రతికించి ఉంచడానికి కావలసిన ప్రధానమైన అవసరాలలో ఒకటని చెపుతాడు.

ఆహారం లాగే గుర్తింపు ఒక జీవితావసరం. ఇది వచ్చే కొలదీ మరింత ఆశిస్తాం. దీనినే `రికగ్నిషన్ హంగర్` అంటారు. ఇది మనుషుల్లో పుట్టినప్పటినుంచే ప్రారంభమౌతుంది. చిన్నిపిల్లల్లో గుర్తింపబడాలనే ఆశ – తల్లితండ్రులు, బందువులు వాళ్ళని ఎత్తుకోవడం, ముద్దుపెట్టుకోవడం, చిటికవెయ్యడం, బుగ్గగిల్లడం మొదలైనవి చెయ్యడం ద్వారా నెరవేరితే; పెద్ద వాళ్ళలో – పలుకరింపు, హేండ్ షేక్, సంభాషణ, ప్రశంస మొదలైనవి ఆ పాత్రని నిర్వర్తిస్తాయి.

ఈ సాంఘిక అవసరం నుంచి వ్యక్తులని దూరం చేసి చూసినపుడు వాళ్ళల్లో నిస్పృహ  కనిపించింది. పోను పోను అది డిప్రెషన్ గా మారి, ఆకలి మందగించింది. తత్ఫలితంగా శరీరానికి సరైన పోషక విలువలు అందక వాళ్ళు క్రమంగా మరణానికి చేరువవయ్యారని పరిశోదనలు తెలియచేశాయట. ఇది కేవలం తాను ఉన్నాననే స్పృహని తెలియచెప్పడానికి మరొక వ్యక్తి చేరువలో లేకపోవడమేనట! ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది సైంటిఫిక్ గా నిరూపించబడిన విషయం.

ఒక వ్యక్తికి ఎంత గుర్తింపు కావాలి అనేది అతను చేసే వృత్తి మీదా, ఉండే పరిస్థితుల మీదా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, ఒక పాపులర్ హీరో ప్రతిరోజూ కొన్ని వందల ప్రశంశలని ఫోన్ కాల్స్ ద్వారా, ఈ మెయిల్ ద్వారా, మీడియా ద్వారా పొందుతూ ఉంటాడు. ఏదైనా కారణం చేత వరుస అపజయాలు ఎదురై లైంలైట్ కి దూరమైతే –   అప్రీసియేషన్  తగ్గి, డిప్రెషన్ కి గురిఅవుతాడు. అదే ఒక సామాన్యుడి కి వచ్చే చిన్న మెచ్చుకోలే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

టీ, సిగరెట్, మందు లాగ ప్రశంస కూడా వ్యసనమే. ఒక్కసారి అలవాటు అయితే మళ్ళీ, మళ్ళీ కావాలనిపిస్తుంది.

అందుకే……ఎన్ని లైకులైనా సరిపోవు. ఇది ఒక సైకొలాజికల్ నెసెసిటీ.
© Dantuluri Kishore Varma 

12 comments:

  1. ఎక్కువగా నగరవాసుల జీవితాలతో కూడిన బ్లాగులు చదివి, చదివి... మీ బ్లాగు చదవడం ఒక పైరచేనుమీదనుంచి వచ్చే పిల్ల తెమ్మరలాగా రిఫ్రెషింగ్ గా ఉంది. పోస్టులు చాలా బాగుంటున్నాయి. మీ చిన్ననాటి ఎడ్వెంచర్ ఇపుడే చదివాను. బాగుంది.

    ReplyDelete
  2. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తేజస్వి గారు. నా పోస్టుకంటే మీ కామెంటే బాగున్నట్టుందండి. :)

    ReplyDelete
  3. నా బ్లాగుకి స్వాగతం మూర్తిగారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. చాలా మంచి విషయం తెలియజేసారు.I liked this very much. నా లైకు మీ అయుష్షును ఆరోగ్యాన్ని పెంచడానికి తోడ్పడితే ధన్యుడినే.నిజంగానే చాలా మంచి విషయం.

    ReplyDelete
  5. నేను చెప్పిన ఎనాలసిస్ నాకే అన్వయించినట్టున్నారు గోపాలకృష్ణారావు గారు! ఏదేమయినా చాలా కాలం నుంచి ఒకస్థాయిలో బ్లాగ్ రాస్తూ, ప్రశంసలని పొందుతున్న మీరు వాటి విలువని బాగానే గ్రహించారు. గురుసమానులైన మీవంటి సీనియర్ బ్లాగర్ నుంచి ఒక లైకుని రాబట్టుకోవడం చాలా సంతోషంగా ఉందండి.

    ReplyDelete
  6. వర్మ గారూ, ఇది నిజంగానే మంచి పోస్టనే అభినందించాను.ఈ గుర్తింపు ప్రాముఖ్యతని అందరూ గుర్తించాలి.ఇంట్లో ఏదో మూల ముసలి వారికింత చోటిచ్చి తిండి పెట్టి వారినుధ్ధరిస్తున్నామని సంతృప్తి చెందే వారు ఆత్మీయమైన పలకరింపుకోసం ఆ వృధ్ధ జీవులుఎంతపరితపిస్తూ ఉంటారో తెలసుకోవాలి.తరగనంత ఆస్తులు సంపాదించుకున్న రాజకీయులు పడరాని అగచాట్లు పడేది కూడా ఈ గుర్తింపు కోసమే.

    ReplyDelete
  7. మీరు చెప్పింది వందశాతం నిజమండి. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలని కోరుకోంటున్నాను రావుగారు :)

    ReplyDelete

  8. "
    మీలో మానవత్వం ఉంటే లైక్ కొట్టండి…
    ప్రతీ షేర్ కీ ఫేస్ బుక్ ఈ పేషంటు కి ఒక డాలర్ పే చేస్తుంది…
    మహేష్ బాబు నవ్వుకి లైక్, పవన్ కల్యాణ్ నవ్వుకి షేర్…
    నువ్వు నిజమైన భారతీయుడివైతే లైక్ చెయ్యి…"

    ha ha ha ....Super like.

    ReplyDelete
  9. నిజమేనండి. ప్రశంస ఒక వ్యసనం.
    తేజస్వి గారితో నేనూ ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  10. నిజమే, నాకోక వెయ్యి కామెంట్లు కావాలండి (ప్రస్తుతానికి).... :D

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!