Pages

Friday 27 September 2013

అహ్మద్ ఆలీకి ఈ సీతారాముల గుడికి సంబంధం ఏమిటి?

కాకినాడ మెయిన్ రోడ్‌లో టౌన్‌హాలుకి ఎదురుగా ఉన్న శ్రీ సీతారామస్వామి దేవాలయం పంతొమ్మిదో శతాబ్ధం నాటిది. ఈ గుడిని నిర్మించడానికి ముందు ఈ ప్రదేశం కాయగూరల పాదులతో నిండి ఉండేదట. ఒకసారి ఆ భూమి యజమాని పాదులు పెట్టడానికి దున్నుతూ ఉండాగా సీతారాముల విగ్రహాలు దొరికాయి. చిన్న పాకలో వాటిని నిలిపి ఆ తరువాత క్రమంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 

ఈ దేవాలయంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీరామ పరివారపు ఉత్సవ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సాధారణంగా సీతారామలక్ష్మణులు, ఆంజనేయుడూ మాత్రమే ఉంటాయి. కానీ, భరతశతృగ్నులు, విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విశేషం గురించి చెపుతూ వంశపారంపర్య అర్చకుడు ఇచ్చిన సమాచారం ఏమిటంటే - గుడిని నిర్మించే సమయంలో కాకినాడ సముద్రతీరంలో ఒక ఓడ ఒడ్డుకు చేరిపోయిందనీ, దానిలో దేవాలయానికి సంబంధించిన అర్చన సామాగ్రి సమస్తం ఒక భోషాణంలో ఉందని గుడిని నిర్మించినాయన స్వప్నంలో శ్రీరాముడు కనిపించి చెప్పాడట. వెళ్ళిచూస్తే నిజమే! పెట్టెలో ప్రస్తుతం గుడిలో ఉన్న శ్రీరామ పరవారం యొక్క విగ్రహాలు, పూజా సామాగ్రీ, గంటతో సహా లభించాయట. 

అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం సంగ్రామానికి సంబంధించిన పుస్తకం ఒకటి చదువుతుంటే, ఈ గుడిని గురించి ప్రస్థావన కనిపించింది. 1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అప్పటి కాంగ్రెస్ అద్యక్షులు మౌలానా అహ్మద్ ఆలీ వాటిలో పాల్గొనడానికి కాకినాడ వచ్చారు. నగరంలో ఊరేగింపు జరుగుతుండగా, ఈ గుడిని దాటి వెళ్ళేటప్పుడు పూజారులు ఆలీకి హారతీ, ప్రసాదం ఇచ్చారు. ఆయన స్వీకరించారు. ఇది అప్పట్లో మతసామరస్యానికి గొప్ప తార్కాణమని పేర్కొన్నారు.  

అదండీ అహ్మద్ ఆలీకి ఈ సీతారాముల గుడికి ఉన్న సంబంధం.
© Dantuluri Kishore Varma 

9 comments:

  1. Replies
    1. VERY EXCELLENT INFORMATION, REGARDING THIS, IF POSSIBLE THE PLEASE LOAD THE HERI.DATORY HISTORY

      Delete
  2. బాదరాయణ సంబంధం కన్నా చిత్రమైనదన్న మాట!

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ చూశాకా, బాదరాయణ సంబంధం గురించి తెలుసుకొన్నాను. ధన్యవాదాలు శ్యామలీయం గారు. నా బ్లాగ్‌కి మీకు హృదయపూర్వక స్వాగతం.

      Delete
  3. మతసామరస్యం కలిగి ఉండటమే మానవత్వం, మీ బ్లాగ్ చాలా హుందాగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. మంచిమాట చెప్పారు. మీ కవిత్వంలాగే మీ కామెంట్‌కూడా అర్దవంతంగా ఉంది. ధన్యవాదాలు.నా బ్లాగ్‌కి మీకు స్వాగతం మెరాజ్ ఫాతిమా గారు.

      Delete
  4. సర్, ధన్యవాదాలు నా బ్లాగ్ కూడ సందర్సించమని కోరుతున్నాను,

    ReplyDelete
    Replies
    1. తప్పనిసరిగానండి. నిజానికి, నేను మీబ్లాగ్ రెగ్యులర్‌గా చదువుతాను.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!