Pages

Thursday 20 February 2014

బాల్‌పెన్నులతో ఏ దేవుడికి పూజ చేస్తారో తెలుసా?

కోనసీమలోని అయినవిల్లి వరసిద్ది వినాయకుడి గుడిలో నిన్న స్వామికి లక్ష కలాల అభిషేకం జరిగింది. ప్రతీ సంవత్సరం మాఘబహుళచవితి నాడు బాల్‌పాయింట్ పెన్నులతో పూజచెయ్యడం ఆనవాయితీ అట. తరువాత వాటిని భక్తులకి పంచిపెడతారు. చుట్టుప్రక్కల అన్నిగ్రామాలనుంచీ విద్యార్థులు వచ్చి వాటిని అపురూపంగా తీసుకొని వెళతారు. దూరప్రాంతాలనుంచి కూడా ప్రయివేట్ స్కూళ్ళు బస్సుల్లో విద్యార్థులని అయినవిల్లికి పంపడం జరుగుతుంది. పరీక్షల సమయమేమో విఘ్ననాయకుడికి పూజచేసిన కలాలు అందుకొంటే పరీక్షలు చకచకా రాసేసి ర్యాంకులు కొట్టేయవచ్చు అని జనాల ప్రగాఢ నమ్మకం.
© Dantuluri Kishore Varma

4 comments:

  1. aaasakthidaayakamaina samaachaaraanni andichaaru varma garu-- dhanyavaaadaalu

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చడం సంతోషాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు.

      Delete
  2. ధన్యవాదాలు. మా కాకినాడ కావలసినప్పుడల్లా చూపిస్తున్న మీకు. (ఇప్పుడే కనబడిందీ కాకినాడ)

    ReplyDelete
    Replies
    1. మీకు స్వాగతం రావు గారు. మీ స్పందన తెలియజేసినందుకు సంతోషం. మనకాకినాడ సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. చదివి ఆనందిస్తారని అనుకొంటున్నాను.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!