Pages

Monday 3 February 2014

హ్యాపీ బర్త్‌డే బుజ్జులూ...

డాడీ కొడుతున్నారని భయంలేదు. పైగా తిరగబడుతుంది బడుద్దాయి. మా చిన్నమ్మాయి వర్షిత. ఈ రోజు తన పదవ పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే బుజ్జులూ...

 

14 comments:

  1. మీ పాప కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు...ఆ భద్రగిరి రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కాంక్షిస్తూ ...!

    ReplyDelete
    Replies
    1. భద్రగిరి రాముడి ఆశీస్సులు మీద్వారా అందడం చాలా సంతోషం. ధన్యవాదాలు మూర్తిగారు.

      Delete
  2. చిట్టితల్లి కి ఆయురారోగ్యాలతో...సుఖ సంతొషాలతో హాయిగా బ్రతకాలని దీవిస్తూ... మెరాజ్

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం మెరాజ్‌గారు. చిట్టితల్లి అన్న మాట చూసి వర్షిత చాలా ఆనందపడిపోతుంది. ధన్యవాదాలు.

      Delete
  3. దీర్ఘాయుష్మాన్భవ!

    ReplyDelete
    Replies
    1. పెద్దవారు మీ ఆశీస్సులు పొందడం వర్షిత అదృష్టం. చాలా ధన్యవాదాలు శర్మగారు.

      Delete
  4. వర్మగారూ,

    చిరంజీవి వర్షితకు మా తరఫున శుభాశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. తను ఇలాగే మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

    మీకు, నాకు పేర్లలోనే కాదు, సంతానంలో కూడా సారూప్యం ఉన్నట్టుంది :). మీకున్నట్టుగానే నాకూ ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నమ్మాయి అర్చన కూడా పదిరోజుల క్రితమే వర్షితలా పదో పుట్టినరోజు చేసుకుంది :)

    భవదీయుడు,
    వర్మ

    ReplyDelete
    Replies
    1. సారూప్యం బాగుంది వర్మగారు. కొంచం ఆలస్యంగా అయినా మీ అమ్మాయి అర్చనకి మా అందరితరఫునా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. మీ ఆశీర్వాదానికి వర్షిత ధన్యవాదాలు తెలియజేస్తుంది.

      Delete
  5. చిన్నారి వర్షిత కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    మరో సారూప్యం. ఈ కిశోర్ కీ ఇద్దరు అమ్మాయిలు - జాహ్నవి, వైష్ణవి. సరిగ్గా కిందటి నెల 3 న చిన్నమ్మాయి వైష్ణవి కి మూడేళ్ళు నిండాయి. ఈ ఫొటోలొ మీ బుజ్జులు ఉందే, దాదాపుగా అలానే ఉంటుంది (గుండుతొ సహా) ఇప్పుడు.

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడే ఊహతెలుస్తున్న మీ వైష్ణవి వయసు పిల్లలతో ఆడుకోవడం భలేగా ఉంటుంది. వాళ్ళ అల్లరి ఒక్కోసారి కోపం తెప్పించినా, తరువాత నవ్వు పుట్టిస్తుంది. మీ అమ్మాయిలకి మా ఆశీస్సులు తెలియజేయండి కిషోర్‌గారు. ధన్యవాదాలు :)

      Delete
  6. హ్యాపీ బర్త్‌డే బుజ్జులూ... శుభాశీస్సులు

    ReplyDelete
    Replies
    1. శ్రీదేవిగారు మీ విషేస్‌చూసి వర్షిత చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ధన్యవాదాలు. వర్షిత చెప్పే థాంక్స్ ఎ మిలియన్ కూడా అందుకోండి మరి.

      Delete
  7. మీ వర్షితా కి నా తరుపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయండి వర్మ గారు radhika (nani)

    ReplyDelete
    Replies
    1. తప్పనిసరిగా రాధికగారు. మీ విషెస్‌కి ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!