Pages

Thursday 27 March 2014

గోవిందా, గోవింద!

ఐదురోజులు శెలవు
మా వూరికి
నా స్కూలుకి
నా బ్లాగుకి
నా ఫేస్‌బుక్‌కి...
నేను శెలవుపెట్టి వెళ్ళినా మావూరు అలాగే ఉంది. నా కోసం ఏమీ బెంగపెట్టుకొన్నట్టు లేదు.
యాన్యువల్‌డే జరుపుకొన్న ఆనందపు అలసటలో మా స్కూలు ఓ రెండురోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పనిలో పడింది. నేను ఎందుకు శెలవు పెట్టానో తెలుసు కనుక ఎవరూ ఫోన్లు చేసి కారణం అడగలేదు.
నా బ్లాగుకి కొంతమంది వచ్చి, చూసో - చదివో వెళ్ళారు. కొత్త టపాలు రాయక పోవడంతో విజిటర్స్ 
సంఖ్య తగ్గి, బ్లాగ్ ర్యాంక్ కూడా తగ్గింది. ఇంచుమించు రోజూ రాసే నేను ఎందుకు రాయడం రాయడంలేదో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు!
మిలియన్ల కొద్దీ ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారుల్లో ఒక్కడంటే ఒక్కడు కొన్ని రోజులు శెలవు పెడితే మునిగిపోయింది ఏమీలేదు. 
ఇవన్నీ నాకు ముందే తెలుసు. అందుకే, నేను కూడా వాటి గురించి పూర్తిగా మరచిపోయి, దేవుడితో అపాయింట్‌మెంట్ తీసుకొన్నా. 
నేను హ్యాపీ!
తిరుమల దేవుడు కూడా హ్యాపీగానే ఉన్నట్టు కనిపించాడు.
గోవిందా... గోవిందా!
మీకు మళ్ళీ కష్టాలు మొదలు :)  
© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!