Pages

Tuesday 17 June 2014

భానుగుడి జంక్షన్

కాకినాడలో భానుగుడి జంక్షన్ అత్యంత ముఖ్యమైన కూడలి. పిఠాపురం నుంచి వస్తూంటే ఏ.డీ.బీ రోడ్డు, ఏ.పీ.ఎస్.పీ, సర్పవరం, బోటుక్లబ్బు, నాగమల్లితోట జంక్షన్, జే.ఎన్.టీ.యూ దాటుకొని భానుగుడి జంక్షన్‌ని చేరుకొంటాం. మరొకవైపునుంచి కరణంగారి జంక్షన్ మీదుగా జే.పీ.టీ దాటి మిలట్రీ రోడ్డు నుంచి భానుగుడికి వస్తాం. ఈ కూడలికి కలిసే మరొక రోడ్డు టూటౌన్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆనంద్ దియేటర్ మీదుగా వచ్చేది. ఇవేకాక అటు శ్రీరాం నగర్ రోడ్డు, ఇటు బస్‌కాంప్లెక్స్ రోడ్డు.. ఆన్నీ ఇక్కడే కలుస్తాయి. 

సినిమాలకోసం వచ్చే వాళ్ళకి ఆనంద్, అంజనీ, గీత్, సంగీత్, పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్లు ఇక్కడ ఉన్నాయి. ఉల్లి సమోసా తిని, చాయ్ తాగి, ఫ్రెండ్‌తో కొంత సేపు బాతాకానీ కొట్టాలంటే చార్మినార్ టీ సెంటరు; అధ్యాత్మికం అయితే అయ్యప్పగుడి, భానుగుడి, సూర్యనారాయణస్వామి గుడి ఉన్నాయి. యూత్ సెంటరు, హేంగ్ ఎరౌండ్ ప్లేస్ అయితే సుబద్రా ఆర్కేడ్ ఉంది. ఇంకా పళ్ళ డాక్టర్లు, కళ్ళ డాక్టర్లు, వాళ్ళ వాళ్ళ మందుల షాపులు, లాబొరేటరీలు, కోటయ్య కాజాల కొట్టు, జోళ్ళ షాపులు, కళ్ళజోళ్ళ షాపులు, మహేంద్రా స్వీట్ స్టాలు... అబ్బో ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. 

జ్ఞాపకాలని పోగేసుకోవడం కోసం, పోగొట్టుకొన్న జ్ఞాపకాలని ఏరుకోవడం కోసం కూడా ఇక్కడికి వస్తారు కొంతమంది. మీరు కాకినాడ వాళ్ళయితే, లేదా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉండుంటే ఈ టపా చదువుతుండగా ఎప్పటివో మధుర స్మృతులు మీ మదిని మీటుతుండవచ్చు.  వాటిని మాతో పంచుకొంటే సంతోషిస్తాం. మీతోనే ఉంచుకొంటానంటే మరీ సంతోషం. 

హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ రీడింగ్ దిస్ పోస్ట్!



© Dantuluri Kishore Varma

4 comments:

  1. కాలేజ్ ఎగ్గొట్టి అండాలమ్మ కాలేజ్ అమ్మాయలను
    ఏడిపించిన న ప్రదేశం కూడా ఇదే.మరిచిపొలేని మధుర స్మ్రుతులు..

    ReplyDelete
    Replies
    1. హా..హా! మీ జ్ఞాపకాలను కూడా పంచుకొన్నందుకు ధన్యవాదాలు.

      Delete
  2. కాలేజీ ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమాలకి వెళ్ళిన జ్ఞాపకాలు.. తతిరుగు ప్రయాణం లో రూమ్ కి వెళ్ళేటప్పుడు దెయ్యాల గురించి మాట్లాడుకుంటూ పసుపు రంగుల్లో ఉన్న సోడియం లైట్ల మధ్య అర్ధరాత్రి వీధుల్ని దాటుకుంటూ చేరడం ఎన్తూ అద్భుతమైన జ్ఞాపకం.. ఈ సిటీ నాకు ఎన్నో జ్ఞాపకాలని మిగిల్చింది రెండు సంవత్సరాలు నేను రూమ్ లో ఉన్నాను . . ఆదిత్య డిగ్రీ కాలేజీ లో బీఎస్సీ చేస్తూ ఎంఎస్సీ ఎంట్రన్స్ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ రాత్రి తొమ్మిది గంటల వరకు వివేకానంద పార్క్ లో ఎంతో మంది నాలాగే పోటీ పరీక్షలకి సిద్దంఅయ్యేవాళ్ళ మధ్య నేను కూడా చదువుకుంటూ.. మళ్ళి ప్రొద్దున్నే నాలుగు గంటలకి డిసెంబర్ నెల చలిలో లక్ష్మి నారాయణ నగర్ నుండి రేచర్లపేట మీదుగా మల్లి అదే పార్క్ కి చేతిలో పుస్తకాలు ఒక క్యాలిక్యులేటర్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన స్మృతులను గుర్తు తెచుకుంటుంటే కళ్ళు చెమర్చుతాయి..ఎప్పుడైనా అటువైపు వెళుతుంటే జేఎన్టియు గోడలని చూస్తూ నేనెప్పుడు అలాంటి సంస్థ లో చదువుతాన అనే అనుకొంటూ ఉండేవాడని.. ప్రస్తుతం దేశం లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటయిన పాండిచేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంఎస్సీ భౌతికశాస్త్రం ఎంట్రన్స్ లో 9 వ ర్యాంకు రావడం తో అక్కడ అడ్మిషన్ వచ్చింది.. నేను కాకినాడ ను మరచిపోలేను.. పాండిచేరి వెళ్ళాలన్నా కాకినాడ మీదుగానే ట్రైన్ఎక్కి వెళ్ళాలి.. సంతోషం. . నా కల నిజమయింది..

    ReplyDelete
    Replies
    1. మీ జ్ఞాపకాలను చక్కగా రాసారు. ఇన్స్పిరేషనల్! మీరు మరిన్ని విజయాలు స్వంతం చేసుకోవాలని అభిలషిస్తున్నాను.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!