Pages

Sunday 11 January 2015

వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నారు కదండీ...

ఈ సంవత్సరం కాకినాడ సాగర సంబరాలు మూడురోజులకీ కలిపి మూడులక్షల మంది వరకూ రావచ్చని అధికారులు అంచనా వేశారని పేపర్లలో వచ్చింది. సంబరాలు జరుగుతున్న ప్రదేశానికి ఒక కిలోమీటరు ముందు నుంచీ అక్కడక్కడా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో ఈ రోజు ఉన్న కార్లనీ, బైకులనీ చూస్తే పట్టణ జనాభా అంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. జనాలు అంచనాలకు మించి వస్తూ ఉండవచ్చు! కానీ, వాహనాలు నిలిపే చోటునుంచి సంబరాలు జరిగే బీచ్ వరకూ కిలోమీటరు పైగానే నడక ఉంది. చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం సరిగా లేనివాళ్ళు అంత దూరం ఎలా నడవగలరో దేవుడికే తెలియాలి. కాళ్ళు నొప్పిపెట్టేలా నడిచి వెళితే సంబరాలు ఏ రకమైన కొత్తదనం లేకుండా మూడవసంవత్సరం కూడా మూసలో పోసినట్టు ఉన్నాయి. నర్సరీ స్టాళ్లు, ప్రభుత్వ సంస్థల స్టాళ్లు, అన్నవరం సత్యదేవుని నమూనా ఆలయం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సభావేదిక, ఫుడ్‌కోర్ట్, జాలీ రైడ్స్, బీచ్ ఇసుకలో చేసిన శిల్పాలు, పూలబండి, పూలపడవ.. వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఫలపుష్ప ప్రదర్శన అని పిలుచుకొనే కాకినాడ ఎగ్జిబిషన్‌నే బీచ్ వొడ్డున పెట్టినట్టు ఉంది. అంచనాలకు మించి వచ్చిన జనాభాలో చాలా మందికి నిరుత్సాహం కలగవచ్చు. సాగర సంబరాలతో పట్టణానికి పండుగ శోభ రావడం నిజమే. అయినప్పటికీ వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నారు కనుక - వచ్చే సంవత్సరానికైనా కాస్తంత వినూత్నత జోడిస్తే సంబరాలు అంబరాన్ని అంటుతాయి.   

సాగర సంబరాలు రేపటితోనే ముగుస్తున్నాయి. ఏ కారణం చేతనైనా చూడలేక పోయిన వాళ్ళ కోసం, దూరం ఊరినుంచి పండుగకి కొంచం ఆలశ్యంగా వస్తున్న వాళ్ళకోసం సాగర సంబరాల ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను. చూసి ఆనందించండి.







© Dantuluri Kishore Varma 

2 comments:

  1. మొత్తం సమాచారం చాలా బావుంది ...ఈ బీచ్ ఎక్కడ ఉంది?

    ReplyDelete
  2. మీ ప్రశంసకి ధన్యవాదాలు చిట్టెన్ రాజుగారు. ఇది కాకినాడ బీచే. స్పెసిఫిక్‌గా అయితే సూర్యారావుపేట బీచ్ అంటారు. రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళు, గార్డెన్ పార్టీలు చేసుకొనేవాళ్ళూ అందరూ ఈ ప్రదేశానికే వెళతారు. మొదటి సంవత్సరం జరిగిన సాగర సంబరాల విశేషాలని కూడా ఈ బ్లాగ్‌లో కవర్ చేశాను. లింక్‌ ఇచ్చాను చూడండి. 2013 సాగసంబరాల లింక్

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!